3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

టెక్‌ రంగంలో పెరుగుతున్న లేఆఫ్‌లు..

Writer: Chandrika 09:37 AM, 3 సెప్టెంబర్, 2026
టెక్‌ రంగంలో పెరుగుతున్న లేఆఫ్‌లు..

టెక్‌ రంగంలో లేఆఫ్‌లు సాధారణంగా మారినప్పటికీ.. దిగ్గజ సంస్థలు భారీ సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. TrueUp గణాంకాల ప్రకారం 2026లో ఇప్పటివరకు 1,75,000కు పైగా టెక్‌ ఉద్యోగాలు కోతకు గురయ్యాయి. 2025లో మొత్తంగా 2,45,000కు పైగా టెక్‌ ఉద్యోగులు ఉపాధి కోల్పోయారు. సాంకేతిక రంగంలో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులు, కంపెనీల పునర్వ్యవస్థీకరణ, కృత్రిమ మేధ (AI)పై పెరుగుతున్న పెట్టుబడులు ఉద్యోగాల కోతకు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి. ఐటీ సేవలకు డిమాండ్‌ తగ్గడం, వ్యాపార వ్యూహాల్లో మార్పులు, ఖర్చులను తగ్గించుకోవడం, కొన్ని విభాగాల్లో బలహీన పనితీరు వంటి కారణాలు కూడా లేఆఫ్‌లకు దారితీస్తున్నాయి.

భారీగా ఉద్యోగాలను తగ్గించిన సంస్థల్లో ఒరాకిల్‌ ముందువరుసలో ఉంది. గత ఏడాది కాలంలో సుమారు 21,000 ఉద్యోగాలను తగ్గించినట్లు సమాచారం. ఇది సంస్థ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 13 శాతానికి సమానం. యాపిల్‌ కూడా విజన్‌ ప్రో హెడ్‌సెట్‌ అభివృద్ధికి సంబంధించిన విభాగంలో కనీసం 60 మంది ఉద్యోగులను తొలగించినట్లు సమాచారం. మైక్రోసాఫ్ట్‌ సుమారు 4,800 ఉద్యోగాలకు లేఆఫ్‌ ప్రకటించగా, ఎక్స్‌బాక్స్‌లో 2027 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి సుమారు 3,200 మంది ఉద్యోగులపై కోత ప్రభావం పడనుంది. వీసా తన మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 7 శాతం, అంటే సుమారు 2,600 ఉద్యోగాలను తగ్గిస్తున్నట్లు సమాచారం. ఉబర్‌ కస్టమర్‌ సర్వీస్‌ విభాగంలో సుమారు 10 శాతం, అంటే దాదాపు 3,400 ఉద్యోగాలను తగ్గించినట్లు తెలుస్తోంది. అమెజాన్‌ కూడా తన ఏఐ కార్యకలాపాల్లో కొన్ని ఉద్యోగాలను తగ్గిస్తోంది. మరోవైపు గూగుల్‌, మెటా, మైక్రోసాఫ్ట్‌ వంటి సంస్థల్లో అధిక వేతనాలతో పనిచేసి లేఆఫ్‌కు గురైన సీనియర్‌ ఉద్యోగులకు సమాన స్థాయి కొత్త ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారిందని సమాచారం. దీంతో కొందరు వ్యక్తిగత బ్రాండ్‌లను అభివృద్ధి చేసుకుంటుండగా, మరికొందరు కన్సల్టింగ్‌ వ్యాపారాలు, స్టార్టప్‌ల వైపు అడుగులు వేస్తున్నారు. ఒరాకిల్‌ మరోసారి ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉద్యోగాలను తగ్గించేందుకు సిద్ధమవుతోందన్న వార్తలు టెక్‌ రంగంలో అనిశ్చితిని మరింత పెంచుతున్నాయి.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌..

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌..

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ

బొల్లారంలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో డిటోనేటర్లు..

బొల్లారంలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో డిటోనేటర్లు..

రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడా? పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు!

రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడా? పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు!

అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధనలు.. తల్లిదండ్రులకు ఇక ఇవి తప్పనిసరి!

అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధనలు.. తల్లిదండ్రులకు ఇక ఇవి తప్పనిసరి!

ట్యాగ్లు
టెక్‌ లేఆఫ్‌లుఏఐ ఉద్యోగాలుటెక్నాలజీ రంగంఒరాకిల్‌ లేఆఫ్‌లుమైక్రోసాఫ్ట్‌ ఉద్యోగాలుయాపిల్‌ ఉద్యోగాలువీసా లేఆఫ్‌లుఉబర్‌ ఉద్యోగాలుఅమెరికా ఉద్యోగాలుటెక్‌ ఇండస్ట్రీ
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
మెగాస్టార్ సినిమాపై వెంకీ అట్లూరి బిగ్ హామీ?
సినిమాలు

మెగాస్టార్ సినిమాపై వెంకీ అట్లూరి బిగ్ హామీ?

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?
జనరల్

చైనా ఆధిపత్యానికి బ్రేక్‌ వేయడం అంత ఈజీ కాదా?

‘డ్రాగన్’ షూట్, రిలీజ్‌పై మేకర్స్ స్పష్టత!
సినిమాలు

‘డ్రాగన్’ షూట్, రిలీజ్‌పై మేకర్స్ స్పష్టత!

టెక్‌ రంగంలో పెరుగుతున్న లేఆఫ్‌లు..
జనరల్

టెక్‌ రంగంలో పెరుగుతున్న లేఆఫ్‌లు..

డబుల్ సెంచరీతో ‘ఇరుముడి’ కొత్త రికార్డు
సినిమాలు

డబుల్ సెంచరీతో ‘ఇరుముడి’ కొత్త రికార్డు

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌..
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌..

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?
గాసిప్స్

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ
జనరల్

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్?
గాసిప్స్

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్?

విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...
సినిమాలు

విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...

దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు?
గాసిప్స్

దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు?

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..
ఆరోగ్యం

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!