
జనరల్

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో పెట్టుకుని భారీగా సీజనల్ ఉద్యోగులను నియమించుకోనుంది. దేశవ్యాప్తంగా సుమారు 1.60 లక్షల మంది సీజనల్ వర్కర్లను రిక్రూట్ చేయనున్నట్లు సంస్థ వెల్లడించింది. ఈ నియామకాల ద్వారా పండుగల సమయంలో పెరిగే ఆర్డర్లను సమర్థంగా నిర్వహించడంతో పాటు డెలివరీ, లాజిస్టిక్స్ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయాలని అమెజాన్ భావిస్తోంది.
ఈ-కామర్స్, క్విక్ కామర్స్ వ్యాపారాలకు పండుగ సీజన్‌లో భారీగా డిమాండ్ పెరిగే అవకాశం ఉందని అమెజాన్ పేర్కొంది. ఆర్డర్ల పరిమాణం, లావాదేవీలు పెరిగే నేపథ్యంలో వినియోగదారులకు వేగవంతమైన సేవలు అందించేందుకు అదనపు సిబ్బంది అవసరమవుతుందని తెలిపింది. అందులో భాగంగానే ఈ భారీ స్థాయి సీజనల్ నియామకాలకు సిద్ధమైంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!