3, సెప్టెంబర్ 2026, గురువారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బొల్లారంలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో డిటోనేటర్లు..

Writer: Chandrika 09:19 AM, 3 సెప్టెంబర్, 2026
బొల్లారంలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో డిటోనేటర్లు..

బొల్లారంలోని మద్రాస్‌ రెజిమెంట్‌ ఫైరింగ్‌ రేంజ్‌ వెనుక గోడ సమీపంలో ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లు లభ్యం కావడం కలకలం రేపింది. ఆర్మీ సిబ్బంది ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తనిఖీలు చేపట్టారు. అక్కడ ప్లాస్టిక్‌ బకెట్‌లో 8 బండిల్స్‌లో మొత్తం 160 ఎలక్ట్రికల్‌ డిటోనేటర్లు ఉన్నట్లు గుర్తించారు. మల్కాజిగిరి బాంబ్‌ డిస్పోజల్‌ టీమ్‌ సూచనల మేరకు అధికారులు వాటిని భద్రపరిచారు. వీటి విలువ సుమారు రూ.32 వేలు ఉంటుందని సమాచారం. డిటోనేటర్లను అక్కడికి తీసుకొచ్చి వదిలి వెళ్లింది ఎవరనే దానిపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదే సమయంలో మద్రాస్‌ రెజిమెంట్‌లో ఆయుధాల చోరీ కేసు దర్యాప్తు కొనసాగుతోంది. రెండ్రోజుల క్రితం ఆయుధాలు భద్రపరిచే గది తాళాన్ని గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టి 12 ఆయుధాలు, మందుగుండు సామగ్రిని ఎత్తుకెళ్లినట్లు ఆర్మీ అధికారులు గుర్తించారు. చోరీకి గురైన వాటిలో నాలుగు ఏకే-47 రైఫిళ్లు, ఆరు పిస్టళ్లు, ఒక ఇన్‌సాస్‌ రైఫిల్‌ ఉన్నట్లు సమాచారం. ఆర్మీ అధికారుల ఫిర్యాదుతో బొల్లారం పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. రక్షణ వ్యవహారాలకు సంబంధించిన కేసు కావడంతో పోలీసులు పలు వివరాలను గోప్యంగా ఉంచుతున్నారు. తాజాగా డిటోనేటర్లు బయటపడటంతో ఈ రెండు ఘటనలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలోనూ దర్యాప్తు సాగుతున్నట్లు తెలుస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ

రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడా? పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు!

రాహుల్ గాంధీ బ్రిటిష్ పౌరుడా? పిటిషన్‌ను తిరస్కరించిన అలహాబాద్ హైకోర్టు!

అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధనలు.. తల్లిదండ్రులకు ఇక ఇవి తప్పనిసరి!

అమెరికాలో పుట్టిన పిల్లల పాస్‌పోర్ట్‌కు కొత్త నిబంధనలు.. తల్లిదండ్రులకు ఇక ఇవి తప్పనిసరి!

పెళ్లైన ఐదు నెలలకే బాద్‌షా విడాకులు.. భార్యకు భరణంగా ఎన్ని కోట్లు ఇచ్చాడంటే?

పెళ్లైన ఐదు నెలలకే బాద్‌షా విడాకులు.. భార్యకు భరణంగా ఎన్ని కోట్లు ఇచ్చాడంటే?

పవన్‌ బర్త్‌డే వేడుకల్లో విషాదం.. కరెంట్‌ షాక్‌తో యువకుడు మృతి

పవన్‌ బర్త్‌డే వేడుకల్లో విషాదం.. కరెంట్‌ షాక్‌తో యువకుడు మృతి

తమిళనాడు ఆలయాల్లో ఇక మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ!

తమిళనాడు ఆలయాల్లో ఇక మొబైల్ ఫోన్లకు నో ఎంట్రీ!

ట్యాగ్లు
బొల్లారంమద్రాస్‌ రెజిమెంట్‌ఆర్మీ ఆయుధాల చోరీడిటోనేటర్లుహైదరాబాద్‌ వార్తలుఆర్మీ భద్రతతెలంగాణ వార్తలుబాంబ్‌ డిస్పోజల్‌ టీమ్‌రక్షణ వార్తలుక్రైమ్‌ న్యూస్
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌..
జనరల్

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో కొత్త ట్విస్ట్‌..

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?
గాసిప్స్

‘ఇరుముడి’ సీక్వెల్‌లో రామ్ చరణ్ లేరట?

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ
జనరల్

కేరళంలో కిమ్స్ హాస్పిటల్ విస్తరణ

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్?
గాసిప్స్

‘రాకా’లో అల్లు అర్జున్ ట్రిపుల్ రోల్?

విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...
సినిమాలు

విజయ్‌ దేవరకొండతో క్వాలిటీ టైమ్‌పై రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు...

దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు?
గాసిప్స్

దుల్కర్ ‘ఐమ్ గేమ్’ తెలుగు షోస్ రద్దు?

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..
ఆరోగ్యం

ఉప్పు నీరు తాగుతున్నారా? డాక్టర్లు ఏమంటున్నారంటే..

హ్యుందాయ్‌ నుంచి రాబోతున్న కొత్త కార్లు
బిజినెస్

హ్యుందాయ్‌ నుంచి రాబోతున్న కొత్త కార్లు

బొల్లారంలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో డిటోనేటర్లు..
జనరల్

బొల్లారంలో ఆర్మీ ఫైరింగ్‌ రేంజ్‌ సమీపంలో డిటోనేటర్లు..

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు
బిజినెస్

అమెజాన్‌లో భారీ ఉద్యోగ నియామకాలు

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!
ఆరోగ్యం

నల్ల జీలకర్రతో ఆరోగ్యానికి మేలు అంటున్న డాక్టర్లు!

బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ ఆమెదే?
షోస్

బిగ్‌బాస్ చరిత్రలో అత్యధిక రెమ్యునరేషన్ ఆమెదే?

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!