

జూనియర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాలోని ‘చుట్టమల్లే’ పాటను అసభ్యకరంగా ఎడిట్ చేసి రూపొందించిన ఏఐ వీడియోపై దర్శకుడు రామ్ గోపాల్ వర్మ స్పందించారు. ఈ వివాదంపై సినీ ప్రముఖులు స్పందించిన తీరును ఆయన తప్పుబట్టారు. కోట్లాది మంది చూసే సెలబ్రిటీలు అభ్యంతరకరమైన కంటెంట్‌కు మరింత ప్రచారం కల్పించేలా పోస్టులు చేయడం సరికాదని ఆర్జీవీ అభిప్రాయపడ్డారు. ఇలాంటి కంటెంట్‌ను మరింత మందికి చేరవేయడం కంటే, దానికి బాధ్యులైన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.
కాగా, ‘చుట్టమల్లే’ పాటను మార్ఫింగ్ చేసి రూపొందించిన ఏఐ వీడియోపై ఇప్పటికే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ కూడా స్పందిస్తూ.. సాంకేతికతను దుర్వినియోగం చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం విజయ్ దేవరకొండ, చిరంజీవి సైతం ఎన్టీఆర్‌కు మద్దతుగా స్పందించారు. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖుల స్పందనపైనే రామ్ గోపాల్ వర్మ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!