

ఈ వారాంతంలో తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు కొత్త సినిమాలు థియేటర్లలోకి రాబోతున్నాయి. వీటిలో రెండు స్ట్రెయిట్ తెలుగు సినిమాలు కాగా, మరో మూడు డబ్బింగ్ చిత్రాలు ఉన్నాయి. ఈ రెండు తెలుగు సినిమాలు విడుదలకు ముందే పెయిడ్ ప్రీమియర్స్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం. ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ గురువారం విడుదల కానుండగా, తెలుగు రాష్ట్రాల్లో బుధవారం సాయంత్రం నుంచే ప్రత్యేక ప్రదర్శనలు ప్రారంభం కానున్నాయి.
ఇక ఈ జాబితాలో దుల్కర్ సల్మాన్, సాత్విక జంటగా నటించిన ఆకాశంలో ఒక తార కూడా చేరింది. పవన్ సాధినేని దర్శకత్వం వహించిన ఈ ఎమోషనల్ డ్రామా శుక్రవారం థియేటర్లలో విడుదల కానుంది. అయితే, ఒక రోజు ముందుగానే గురువారం సాయంత్రం నుంచి పెయిడ్ ప్రీమియర్స్ వేయాలని మేకర్స్ నిర్ణయించారు. ట్రైలర్‌కు వచ్చిన స్పందనతో సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. ఈ రెండు చిత్రాల ప్రీమియర్ షోలకు ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!