

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ఉస్తాద్ భగత్ సింగ్ శరవేగంగా ముందుకెళ్తోంది. తాజా అప్డేట్గా ఈ సినిమాలో కథానాయిక రాశీ ఖన్నా తన డబ్బింగ్ పనులను ప్రారంభించారు. స్టూడియోలో దర్శకుడు హరీష్ శంకర్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, షూటింగ్ అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మార్చి 26 న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో శ్రీలీల మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. రాశీ ఖన్నా డబ్బింగ్ మొదలవడంతో సినిమా నిర్మాణాంతర పనులు తుది దశకు చేరుకున్నాయి. వేసవి సెలవులను లక్ష్యంగా చేసుకుని వస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కొత్త రికార్డులు సృష్టిస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు.









.avif&w=3840&q=75)

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!