

హైదరాబాద్‌లోని అంబర్‌పేట్ జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్ పూల్‌లో 2026 మే 24న నిర్వహించిన 11వ తెలంగాణ సీనియర్ అంతర్‌జిల్లా స్విమ్మింగ్ ఛాంపియన్‌షిప్‌లో జరిగిన ఎంపిక పరీక్షల్లో ఎల్. అనిరుధ్ తెలంగాణ రాష్ట్ర సీనియర్ వాటర్ పోలో జట్టుకు ఎంపికయ్యారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ఆయన ప్రదర్శనకు గుర్తింపుగా ఈ అవకాశం లభించింది.
అనిరుధ్ ఎంపికపై స్ట్రోక్స్ స్విమ్మింగ్ స్కూల్ యజమాని చెరుకూరి భరత్, వినయ్, ఇన్‌చార్జ్ ప్రసాద్, స్ట్రోక్స్ ప్రధాన శిక్షకుడు మరియు నిర్వాహకుడు ముక్తార్ అహ్మద్, గచ్చిబౌలి ఆక్వాటిక్ స్టేడియం స్విమ్మింగ్ శిక్షకుడు తిరుపతి అభినందనలు తెలిపారు. ఆయన 2026 జూలై 7 నుంచి జూలై 12 వరకు చెన్నైలోని ఎస్‌ఆర్‌ఎం విద్యా సంస్థ కట్టాంకులతూర్‌లోని డాక్టర్ టీ.కే. పారివేందర్ ఆక్వాటిక్ కాంప్లెక్స్‌లో జరిగే 79వ సీనియర్ జాతీయ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్‌లో తెలంగాణ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!