
జనరల్

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక జీవో విడుదల చేసినప్పటికీ, నిజాం ఏరియాలో పూర్తిస్థాయి బుకింగ్స్ ఇంకా ప్రారంభం కాలేదు. మంగళవారం మధ్యాహ్నం రావాల్సిన జీవో రాత్రి విడుదలైంది. దీంతో టికెట్ ధరల పెంపుకు అనుమతి లభించింది.
జీవో ప్రకారం సింగిల్ స్క్రీన్స్‌లో రూ.100 వరకు, మల్టీప్లెక్సుల్లో రూ.125 వరకు టికెట్ ధరలు పెంచుకోవచ్చు. అలాగే ఈ పెరిగిన ధరలు 10 రోజుల పాటు వర్తిస్తాయి. ఈరోజు రాత్రి 8 గంటలకు స్పెషల్ ప్రీమియర్ షోకు అనుమతి ఇచ్చారు. అయితే ఒక్క ప్రీమియర్ షోకే పరిమితం చేశారు, మిడ్నైట్ షోలకు అనుమతి లేదు. కొన్ని థియేటర్లలో మాత్రమే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి, పూర్తి స్థాయి బుకింగ్స్ ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!