

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది. రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 1854 నుంచి 1878 మధ్య జరిగిన చారిత్రక సంఘటనల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బ్రిటిష్ పాలనను ఎదిరించిన యోధుడి పాత్రలో విజయ్ దేవరకొండ కనిపించనుండగా, జయమ్మ పాత్రలో రష్మిక మందన్న నటిస్తోంది.
ప్రస్తుతం వైఎస్ఆర్ కడప జిల్లా గండికోటలో కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. చారిత్రక నేపథ్యానికి అనుగుణంగా గండికోటలోని పలు ప్రాంతాలను షూటింగ్ కోసం ఎంపిక చేశారు. గుర్రపు స్వారీ చేస్తూ శత్రువులను ఎదుర్కొనే విజయ్ దేవరకొండ యాక్షన్ సీక్వెన్స్ ఈ చిత్రంలో ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని సమాచారం. షూటింగ్‌కు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!