
జనరల్

కర్ణాటక ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్న డీకే శివకుమార్ తన ఆధ్యాత్మిక విశ్వాసాలను మరోసారి చాటుకున్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముందు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, లోక్ భవన్ గ్లాస్ హౌస్లో జరిగే కార్యక్రమానికి వివిధ మతాలకు చెందిన ప్రముఖ ఆధ్యాత్మిక నేతలను ఆహ్వానించారు.
వొక్కలిగ, వీరశైవ-లింగాయత మఠాధిపతులతో పాటు బౌద్ధ, క్రైస్తవ, ముస్లిం మత ప్రతినిధులు కూడా ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు. అన్ని మతాలకు సమాన గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో డీకే శివకుమార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!