
జనరల్

రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమాకు టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఈ నిర్ణయంతో థియేటర్లలో సినిమా విడుదల సమయంలో ప్రత్యేక ధరలు అమల్లోకి రానున్నాయి.

సింగిల్ స్క్రీన్స్ థియేటర్లలో రూ.100 వరకు, మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.125 వరకు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. అలాగే 3వ తేదీ రాత్రి ప్రీమియర్ షోకు రూ.600 టికెట్ ధర నిర్ణయించేందుకు కూడా అనుమతి లభించింది. ఈ పెంపు 10 రోజుల పాటు అమల్లో ఉండనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!