

సందీప్ రెడ్డి వంగా పెద్దన్నయ్య ప్రణయ్ రెడ్డి వంగా తాజాగా ఓ ఇంటర్వ్యూలో ‘అర్జున్ రెడ్డి’ సినిమా నిర్మాణ సమయంలో ఎదురైన ఆర్థిక సమస్యల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఈ సినిమా కోసం తాము పెద్ద మొత్తంలో ఆస్తులను అమ్మాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.
‘అర్జున్ రెడ్డి’ సినిమా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత కొందరు నిర్మాతలు దాదాపు 50 శాతం పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చారని ప్రణయ్ చెప్పారు. అయితే విజయ్ దేవరకొండ నటించిన ‘పెళ్లి చూపులు’ మంచి విజయం సాధించినప్పటికీ, పెట్టుబడి పెడతామని కాంట్రాక్ట్‌పై సంతకం చేసిన వారు ఆ తర్వాత వెనక్కి తగ్గారని తెలిపారు.
దీంతో సినిమా పూర్తి చేయడానికి అవసరమైన డబ్బు కోసం తమకు ఉన్న ఓ మామిడి తోటను అమ్మేశామని ప్రణయ్ వెల్లడించారు. ఆ డబ్బుతో ‘అర్జున్ రెడ్డి’ సినిమాను పూర్తి చేశామని చెప్పారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ దేవరకొండ, శాలిని పాండే ప్రధాన పాత్రల్లో నటించారు. 2017లో విడుదలైన ఈ సినిమా భారీ బ్లాక్‌బస్టర్‌గా నిలవడంతో పాటు టాలీవుడ్‌లో కల్ట్ క్లాసిక్‌గా గుర్తింపు పొందింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!