
సినిమాలు

నాగార్జున “లెనిన్” సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించి అందరికీ ఆశ్చర్యం కలిగించారు. ఈ సినిమా 2026 జూన్ 26 న విడుదల అవుతుందని వెల్లడిస్తూ వాయిదా వార్తలకు తెరదించారు. అలాగే ఈ చిత్రంలో అఖిల్ అక్కినేని కొత్తగా కనిపించనున్నాడని చెప్పడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
సినిమాకు ఇంకా కొంత పని మిగిలి ఉందన్న వార్తలు వచ్చినప్పటికీ, విడుదల తేదీ విషయంలో చిత్రబృందం వెనక్కి తగ్గలేదు. మరోవైపు జూన్ 25న విడుదల కానున్న “పెద్ది” సినిమాతో బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు సినిమాలు ఒకేసారి విడుదలైతే టాలీవుడ్లో భారీ పోటీ చూడొచ్చని సినీ వర్గాలు భావిస్తున్నాయి.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!