6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో ముందడుగు

Writer: Pooja 06:13 AM, 6 నవంబర్, 2026
అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో ముందడుగు

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో కీలక ముందడుగు వేసింది. అంతరిక్షంలో పేరుకుపోతున్న వ్యర్థాలను తొలగించడంతోపాటు, కక్ష్యలోనే ఉపగ్రహాలకు మరమ్మతులు, సేవలు అందించే లక్ష్యంతో దేశంలోనే తొలి ప్రైవేట్‌ సమగ్ర అంతరిక్ష సేవల కేంద్రం హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. కాస్మోసర్వ్‌ స్పేస్‌ సంస్థ ఏర్పాటు చేసిన ‘బేస్‌-1’ కేంద్రాన్ని గురువారం కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ వర్చువల్‌గా, రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ప్రత్యక్షంగా ప్రారంభించారు. అంతరిక్షంలోని వస్తువులను గుర్తించే స్పేస్‌ విజన్‌ ఎఫెక్ట్‌, మైక్రోగ్రావిటీ సిమ్యులేషన్‌ సదుపాయాలు ఈ కేంద్రంలో ఉన్నాయి. ప్రపంచంలోనే ఇలాంటి సదుపాయాలతో ఏర్పాటైన ఆరో కేంద్రంగా ఇది నిలిచిందని సంస్థ వర్గాలు పేర్కొన్నాయి. ఉపగ్రహ సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం, పరీక్షించడం, ప్రయోగాలు నిర్వహించడం వంటి కార్యకలాపాలకు ఈ కేంద్రం వేదిక కానుంది.

బేస్‌-1 ప్రారంభం భారత ప్రైవేట్‌ అంతరిక్ష రంగంలో కీలక మైలురాయి అని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ అన్నారు. అంతరిక్ష రోబోటిక్స్‌, ఉపగ్రహాలను చేరుకోవడం, వాటితో అనుసంధానం, మిషన్‌ కంట్రోల్‌ వంటి సదుపాయాలను ఒకే చోట అందించడం ద్వారా భారత అంతరిక్ష స్టార్టప్‌ల సామర్థ్యాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన చిరంజీవి ఫణీంద్ర, ఆయన బృందాన్ని అభినందించారు. ప్రముఖ వ్యోమగాములు రాకేశ్‌ శర్మ, శుభాంశు శుక్లా కూడా వీడియో సందేశాల ద్వారా ఫణీంద్రకు శుభాకాంక్షలు తెలిపారు. అంతరిక్ష వ్యర్థాల సమస్య పరిష్కారానికి కాస్మోసర్వ్‌ వంటి సంస్థలు ముందుకు రావడం గొప్ప పరిణామమని మంత్రి శ్రీధర్‌బాబు కొనియాడారు. అంతరిక్ష ఆవిష్కరణల్లో హైదరాబాద్‌ దేశానికే దిశానిర్దేశం చేస్తోందని, నగరంలో ఇప్పటికే 30కి పైగా స్పేస్‌టెక్‌ కంపెనీలు ఉన్నాయని తెలిపారు. వీటిలో దేశంలోనే తొలి స్పేస్‌టెక్‌ యూనికార్న్‌తోపాటు, త్వరలో ఆ స్థాయికి చేరుకునే అవకాశమున్న మరికొన్ని సంస్థలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు.

హైదరాబాద్‌లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఏరోస్పేస్‌, రక్షణ రంగాలు, 52 జాతీయ పరిశోధనా ప్రయోగశాలలు, 15 లక్షల మంది ఇంజినీర్ల నైపుణ్యం, స్థానికంగా దాదాపు 90 శాతం విడిభాగాల అవసరాలను తీర్చగల సరఫరా వ్యవస్థ ఈ అభివృద్ధికి దోహదపడుతున్నాయని శ్రీధర్‌బాబు వివరించారు. ప్రపంచంలోనే అత్యంత తక్కువ వ్యయంతో అంతరిక్ష సాంకేతికతను అందించే కేంద్రంగా హైదరాబాద్‌ ఎదుగుతోందని అన్నారు. ఈ రంగంలోని ఆవిష్కర్తలను ప్రోత్సహించేందుకు భారత్‌ ఫ్యూచర్‌ సిటీలో ప్రత్యేకంగా స్పేస్‌ సిటీని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని వెల్లడించారు. కాస్మోసర్వ్‌ స్పేస్‌ తన తొలి ఏడాదిలోనే పలు మైలురాళ్లను అధిగమించిందని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో చిరంజీవి ఫణీంద్ర తెలిపారు. భారత రాకెట్‌ ద్వారా తొలి పేలోడ్‌ను అంతరిక్షంలోకి పంపడంతోపాటు, సీడ్‌ ఫండింగ్‌ను కూడా సమీకరించామని చెప్పారు. గగన్‌యాన్‌, భారతీయ అంతరిక్ష కేంద్రం (బీఏఎస్‌), భవిష్యత్తులో చేపట్టే ఉపగ్రహ ప్రయోగాల కోసం కక్ష్యలో సేవలు అందించే సామర్థ్యాన్ని అభివృద్ధి చేయడంలో బేస్‌-1 కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి

మురసు తుఫాన్‌ బీభత్సం.. బోటు మునిగి ఐదుగురు మత్స్యకారులు మృతి

ట్యాగ్లు
హైదరాబాద్ స్పేస్ హబ్కాస్మోసర్వ్ స్పేస్బేస్ 1 కేంద్రంఅంతరిక్ష సాంకేతికతఉపగ్రహ సేవలుభారత అంతరిక్ష రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెహికిల్‌ సొల్యూషన్స్‌ రంగంలోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా
బిజినెస్

వెహికిల్‌ సొల్యూషన్స్‌ రంగంలోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు
రాజకీయాలు

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు

టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ దూకుడు
బిజినెస్

టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ దూకుడు

రెండో త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం వృద్ధి
బిజినెస్

రెండో త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం వృద్ధి

కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు

కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు
రాజకీయాలు

కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో ముందడుగు
జనరల్

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో ముందడుగు

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
జనరల్

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్
జనరల్

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
జనరల్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
జనరల్

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి
జనరల్

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!