6, నవంబర్ 2026, శుక్రవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానంనిబంధనలు & షరతులు
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంనవలలురచయితలుడ్రాయింగ్స్పోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిమాతో ప్రకటనలు ఇవ్వండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానంనిబంధనలు & షరతులు

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు

Writer: Pooja 06:18 AM, 6 నవంబర్, 2026
కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు

తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా చెప్పుకొంటున్న బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ రాజకీయంగా ఐరన్‌ లెగ్‌గా మారారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు రామ్‌ మాధవ్‌ ఎద్దేవా చేశారు. హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో జాతీయ స్థాయిలో థర్డ్‌ ఫ్రంట్‌ ఏర్పాటు చేస్తానంటూ కేసీఆర్‌ దేశవ్యాప్తంగా పర్యటించి ఎవరినైతే కలిశారో, వారంతా ఎన్నికల్లో ఓటమి పాలయ్యారని విమర్శించారు. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా మాజీ ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌, వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, చివరకు కేసీఆర్‌ కూడా ప్రజల చేతిలో ఓటమి చవిచూశారని వ్యాఖ్యానించారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు తిరుగులేని ప్రత్యామ్నాయం బీజేపీయేనని పేర్కొన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వ అవినీతి, తప్పిదాలు, పాలనా వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని తెలిపారు. కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ దేశ సమస్యలను పట్టించుకోకుండా ఎక్కువ సమయం అమెరికా, యూరప్‌ పర్యటనల్లో గడుపుతున్నారని ఆరోపించారు. మరోవైపు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి ఢిల్లీ పర్యటనలకే పరిమితమవుతున్నారని విమర్శించారు.

బీజేపీయే ప్రత్యామ్నాయం: రామచంద్రరావు

కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలను వీడి పలువురు యువత బీజేపీలో చేరుతున్నారని ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచంద్రరావు తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలకు ప్రత్యామ్నాయంగా ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. గురువారం పాతబస్తీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరినట్లు వెల్లడించారు.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

AdvertisementAdvertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు

కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు

కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు

చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక

చెన్నైలో వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె వివాహ వేడుక

గోకుల్ డెయిరీ వివాదం.. రాహుల్ గాంధీకి ఫడ్నవీస్ స్ట్రాంగ్ కౌంటర్

గోకుల్ డెయిరీ వివాదం.. రాహుల్ గాంధీకి ఫడ్నవీస్ స్ట్రాంగ్ కౌంటర్

ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

ఏపీలో ముగిసిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్

ప్రభుత్వ విప్‌ వేముల వీరేశంకు త్రుటిలో తప్పిన ప్రమాదం!

ప్రభుత్వ విప్‌ వేముల వీరేశంకు త్రుటిలో తప్పిన ప్రమాదం!

ట్యాగ్లు
రామ్ మాధవ్కేసీఆర్తెలంగాణ బీజేపీబీఆర్ఎస్ పార్టీకాంగ్రెస్ ప్రభుత్వంతెలంగాణ రాజకీయాలు
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
వెహికిల్‌ సొల్యూషన్స్‌ రంగంలోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా
బిజినెస్

వెహికిల్‌ సొల్యూషన్స్‌ రంగంలోకి ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్‌ ఇండియా

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు
రాజకీయాలు

ఆర్‌ఆర్‌ ట్యాక్స్‌ వసూళ్లపై కేటీఆర్‌ కీలక ఆరోపణలు

టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ దూకుడు
బిజినెస్

టెలికాం మార్కెట్లో ఎయిర్‌టెల్‌ దూకుడు

రెండో త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం వృద్ధి
బిజినెస్

రెండో త్రైమాసికంలో మహీంద్రా అండ్‌ మహీంద్రా నికర లాభం వృద్ధి

కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు
రాజకీయాలు

కేంద్ర ప్రభుత్వంపై ఒవైసీ తీవ్ర విమర్శలు

కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు
రాజకీయాలు

కేసీఆర్‌పై బీజేపీ నేత రామ్‌ మాధవ్‌ సెటైర్లు

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో ముందడుగు
జనరల్

అంతరిక్ష రంగంలో హైదరాబాద్‌ మరో ముందడుగు

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి
జనరల్

ఆయిల్‌ పామ్‌ రైతుల రక్షణకు దిగుమతి సుంకాన్ని పెంచాలి..కేంద్రానికి మంత్రి తుమ్మల విజ్ఞప్తి

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్
జనరల్

వైకుంఠ ద్వార దర్శనాల వేళ భక్తులకు టీటీడీ గుడ్‌న్యూస్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు
జనరల్

భవానీ దీక్షల కోసం విజయవాడ దుర్గమ్మ ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి
జనరల్

వీబీజీరామ్‌జీ పథకం అమలుపై తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశంసించిన కేంద్ర మంత్రి

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి
జనరల్

మలబార్‌-2026 విన్యాసాల కోసం జపాన్‌కు చేరుకున్న ఐఎన్‌ఎస్‌ సహ్యాద్రి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!