

నమిత్ మల్హోత్రా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన పౌరాణిక ఇతిహాస చిత్రం రామాయణ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైంది. రణ్‌బీర్ కపూర్, యశ్, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి నితేశ్ తివారీ దర్శకత్వం వహించారు. విడుదలైన తొలి షోల నుంచే భారీ విజువల్స్, నటీనటుల పెర్ఫార్మెన్స్‌పై సానుకూల స్పందనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి కూడా సినిమాపై తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా పంచుకున్నారు. సినిమా స్థాయి, వెండితెరపై చూపించిన విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని ప్రశంసించారు. ముఖ్యంగా వనవాసం ఘట్టం నుంచి రణ్‌బీర్ కపూర్ శ్రీరాముడి పాత్రలో ప్రశాంతంగా, అద్భుతంగా నటించారని కొనియాడారు.
యశ్ రావణుడి పాత్రలో భయంకరమైన ఉనికిని చూపించారని, సాయి పల్లవి సీత పాత్రలో ఎంతో హుందాగా కనిపించారని రాజమౌళి ప్రశంసించారు. ప్రీ-క్లైమాక్స్, క్లైమాక్స్ సన్నివేశాలు తనకు ఎంతగానో నచ్చాయని పేర్కొన్నారు. ఇంతటి ప్రతిష్ఠాత్మకమైన విజన్‌ను అద్భుతంగా తెరపైకి తీసుకొచ్చిన నిర్మాత నమిత్ మల్హోత్రా, దర్శకుడు నితేశ్ తివారీతో పాటు చిత్ర బృందం మొత్తానికి అభినందనలు తెలిపారు. రాజమౌళి నుంచి వచ్చిన ఈ ప్రశంసలు సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తిని మరింత పెంచాయి.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!