
రాజకీయాలు

టెలికాం ఆపరేటర్ భారతి ఎయిర్‌టెల్ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ లాభంలో వార్షిక ప్రాతిపదికన 24 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో రూ.60,877.5 కోట్ల ఏకీకృత ఆదాయంపై రూ.10,710 కోట్ల లాభాన్ని ప్రకటించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.52,145.4 కోట్ల ఆదాయంపై రూ.8,651 కోట్ల లాభాన్ని ఆర్జించింది. దీంతో కంపెనీ కన్సాలిడేటెడ్ ఆదాయం కూడా గత ఏడాదితో పోలిస్తే 16.7 శాతం పెరిగింది.
సమీక్షా త్రైమాసికంలో భారతి ఎయిర్‌టెల్ భారత్‌లోని ఆదాయం 9.4 శాతం పెరిగి రూ.42,308 కోట్లకు చేరుకుంది. ఇండియా మొబైల్ సర్వీసెస్ విభాగం ఆదాయం వార్షిక ప్రాతిపదికన 10.1 శాతం వృద్ధి చెందింది. మరోవైపు, ఒక్కో వినియోగదారుడి నుంచి సగటున వచ్చే ఆదాయం (ఆర్పూ) కూడా పెరిగింది. గత ఏడాది రెండో త్రైమాసికంలో రూ.256గా ఉన్న ఆర్పూ, ఈసారి రూ.271కు చేరింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!