
రాజకీయాలు

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శ్రీహరికోటకు ప్రత్యామ్నాయంగా తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా కులశేఖరపట్నంలో నిర్మిస్తున్న కొత్త రాకెట్ ప్రయోగ కేంద్రం త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ లాంచ్ ప్యాడ్ నుంచి వచ్చే ఏడాది తొలి రాకెట్‌ను ప్రయోగించనున్నట్లు ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ వెల్లడించారు. గురువారం పెరియార్ సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా సోవియెట్ వ్యోమగామి యూరీ గగారిన్ విగ్రహాన్ని నారాయణన్ ఆవిష్కరించారు. కొత్త లాంచ్ ప్యాడ్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని, వచ్చే ఏడాది తొలి ప్రయోగానికి ఈ కేంద్రం సిద్ధమవుతుందని ఆయన తెలిపారు. భారత అంతరిక్ష కార్యక్రమాలకు, ముఖ్యంగా మానవ సహిత అంతరిక్ష యాత్ర ‘గగన్‌యాన్’కు రష్యా అందిస్తున్న సహకారానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!