
రాజకీయాలు

సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం) కన్సాలిడేటెడ్ నికర లాభంలో 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ.4,587.88 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.3,673 కోట్లతో పోలిస్తే లాభం గణనీయంగా పెరిగింది. సమీక్షా కాలంలో కంపెనీ ఆదాయం కూడా రూ.45,885.40 కోట్ల నుంచి రూ.57,514.98 కోట్లకు చేరింది.
మరోవైపు, ఇదే త్రైమాసికంలో కంపెనీ మొత్తం వ్యయాలు కూడా పెరిగాయి. గత ఏడాది రూ.41,192.50 కోట్లుగా ఉన్న వ్యయాలు ఈసారి రూ.51,845.48 కోట్లకు చేరాయి. కాగా, తన వాహన శ్రేణిని మరింత విస్తరించేందుకు మహీంద్రా అండ్ మహీంద్రా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. 2027 జూన్ నాటికి నాలుగు ఎస్‌యూవీలతో పాటు ఒక తేలికపాటి వాణిజ్య వాహనాన్ని మార్కెట్లోకి విడుదల చేయాలని కంపెనీ భావిస్తోంది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!