

కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థ ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా వెహికిల్ సొల్యూషన్స్ వ్యాపారంలోకి విస్తరిస్తున్నట్లు గురువారం ప్రకటించింది. వ్యాపార పోర్ట్‌ఫోలియోను విస్తరించడంలో భాగంగా దక్షిణ కొరియాలోని మాతృ సంస్థకు చెందిన గ్లోబల్ ఆటోమోటివ్ వ్యాపారాన్ని భారత మార్కెట్లోకి తీసుకురానుంది. ఇందులో భాగంగా ఆటోమోటివ్ ఇన్ఫోటైన్‌మెంట్, టెలీమాటిక్స్ సొల్యూషన్స్‌తో పాటు ఎల్‌జీ కొరియా గ్లోబల్ బీ2బీ ఆటోమోటివ్ ఉత్పత్తులను భారత్‌లో అందుబాటులోకి తీసుకురానుంది.
ఈ ఉత్పత్తులను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీసిటీలో ఉన్న ఎల్‌జీ ఇండియా ప్లాంట్‌లో తయారు చేసి సరఫరా చేయనున్నట్లు కంపెనీ వెల్లడించింది. ఇదిలా ఉండగా, సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికంలో ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా నికర లాభం వార్షిక ప్రాతిపదికన 25.65 శాతం పెరిగి రూ.489.34 కోట్లకు చేరింది. గత ఏడాది ఇదే కాలంలో లాభం రూ.389.43 కోట్లుగా నమోదైంది. సమీక్షా త్రైమాసికంలో కంపెనీ ఆదాయం కూడా 19.53 శాతం వృద్ధితో రూ.6,174 కోట్ల నుంచి రూ.7,380 కోట్లకు పెరిగింది.




















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!