
జనరల్

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్, 1974 నుంచి నివసిస్తున్న బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్‌ను వదిలి, త్వరలోనే రూ.350 కోట్లకు పైగా విలువైన సీ-ఫేసింగ్ లగ్జరీ బంగ్లాలోకి మారబోతున్నారు. ప్రస్తుతం ఆయన నివసిస్తున్న ఇంటికి సమీపంలోని అత్యంత ఖరీదైన చింబై ఏరియాలో ఈ కొత్త భవనం నిర్మాణం వేగంగా కొనసాగుతోంది.
సల్మాన్ తల్లి సల్మా ఖాన్ పేరుతో ఉన్న 11వేల చదరపు అడుగుల స్థలంలో సచ్ డెవలపర్స్ ఈ ఆరు అంతస్తుల ఆధునిక బంగ్లాను నిర్మిస్తున్నారు. ఇందులో డబుల్ బేస్‌మెంట్ పార్కింగ్, ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్స్, జిమ్, సీ వ్యూ హాల్స్ వంటి లగ్జరీ సౌకర్యాలు ఉండనున్నాయి. గత ఘటనలు, భద్రతా కారణాలు, బెదిరింపుల నేపథ్యంలో ఈ మార్పు తీసుకున్నారని సమాచారం.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!