

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హెయిర్‌కట్ ఖర్చు ప్రస్తుతం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ సెలబ్రిటీ హెయిర్ స్టైలిస్ట్ ఆలం హకీమ్‌తో అల్లు అర్జున్ ఇటీవల కొత్త హెయిర్‌స్టైల్ చేయించుకున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. సెలబ్రిటీలకు స్టైలింగ్ చేయడంలో పేరుగాంచిన ఆలం హకీమ్ ఒక వ్యక్తిగత గ్రూమింగ్ సెషన్‌కు రూ.1 లక్ష ఫీజు వసూలు చేస్తున్నట్లు సమాచారం. దీనికి 18 శాతం జీఎస్టీ కింద మరో రూ.18 వేలు కలిపితే మొత్తం ఖర్చు రూ.1.18 లక్షలకు చేరుతుంది. ఒక్క హెయిర్‌కట్‌కే ఇంత భారీ మొత్తం ఖర్చవుతుందన్న విషయం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
సాధారణంగా హెయిర్‌కట్ కోసం వందల రూపాయలు ఖర్చు చేసే సామాన్యులకు ఈ ధర షాక్‌కు గురిచేస్తోంది. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తమదైన శైలిలో సరదా కామెంట్లు చేస్తున్నారు. సెలబ్రిటీల లగ్జరీ జీవనశైలి, వ్యక్తిగత గ్రూమింగ్ కోసం వారు వెచ్చించే భారీ మొత్తాలపై మరోసారి చర్చ మొదలైంది. అయితే అల్లు అర్జున్ ఈ సెషన్ కోసం నిజంగా రూ.1.18 లక్షలు చెల్లించినట్లు అధికారిక ధృవీకరణ లేదు.




కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!