

యువ నటుడు తేజ సజ్జా త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నారు. హైదరాబాద్‌లో సోమవారం కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఆయన నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు సినీ, రాజకీయ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరై కాబోయే వధూవరులను ఆశీర్వదించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మాజీ మంత్రి హరీశ్ రావు, దర్శకులు కె. రాఘవేంద్రరావు, ప్రశాంత్ వర్మ, కార్తిక్ ఘట్టమనేని, నటులు చిరంజీవి, రవితేజ, రానా దగ్గుబాటి, శివాజీ, వరలక్ష్మి శరత్‌కుమార్ దంపతులు వేడుకలో సందడి చేశారు. నిర్మాతలు టీజీ విశ్వప్రసాద్, సాహు గారపాటి కూడా హాజరై జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
తేజ సజ్జా వివాహం డిసెంబర్లో రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో జరగనుంది. అనంతరం హైదరాబాద్‌లో ఘనంగా రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. తనది పెద్దలు కుదిర్చిన వివాహమని, కాబోయే భార్య కుటుంబానికి సినీ పరిశ్రమతో ఎలాంటి సంబంధం లేదని తేజ ఇటీవల వెల్లడించారు. ఆమె కుటుంబం టెక్నాలజీ వ్యాపారంలో ఉందని కూడా తెలిపారు. నిశ్చితార్థ వేడుకతో తేజ జీవితంలో కొత్త అధ్యాయం ప్రారంభం కావడంతో అభిమానులు ఆయన పెళ్లి వేడుక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!