

సత్యదేవ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సైకాలజికల్ డ్రామా ‘రావు బహదూర్’ జూలై 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. వెంకటేశ్ మహా దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మహేశ్ బాబు, నమ్రత శిరోద్కర్ తమ జీఎంబీ ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సమర్పిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, పోస్టర్లు సినిమాపై ఆసక్తిని పెంచగా, ఇప్పుడు మహేశ్ బాబు చేసిన వ్యాఖ్యలు చిత్రంపై మరింత హైప్‌ను తీసుకొచ్చాయి.

సినిమా ఫైనల్ కట్‌ను వీక్షించిన మహేశ్ బాబు సోషల్ మీడియాలో స్పందిస్తూ ‘రావు బహదూర్’ సాధారణ సినిమా కాదని, ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోయే అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు. దర్శకుడు వెంకటేశ్ మహా సృష్టించిన ప్రపంచం అద్భుతంగా ఉందని, సత్యదేవ్ తన నటనతో ఆ ప్రపంచాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాడని ప్రశంసించారు. దీపా థామస్ సహా మొత్తం నటీనటులు, సాంకేతిక బృందం అద్భుతంగా పనిచేశారని చెబుతూ చిత్ర బృందంపై గర్వంగా ఉందన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!