

అమెరికాలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న సైకాలజికల్ థ్రిల్లర్ M4M (మోటివ్ ఫర్ మర్డర్) చిత్రం 60 రోజుల విజయోత్సవాన్ని జూలై 18, 2026న కాలిఫోర్నియాలోని శాన్‌ఫ్రాన్సిస్కో బే ఏరియాలో ఉన్న సినీ లౌంజ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలో దర్శక-నిర్మాత మోహన్ వడ్లపట్ల, హీరోయిన్ జో శర్మ కలిసి M4M-2 సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. అభిమానులు, కమ్యూనిటీ నాయకులు, సినీ ప్రముఖులు, మీడియా ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి చిత్ర విజయాన్ని ఘనంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన మోహన్ వడ్లపట్ల, ప్రేక్షకుల ఆదరణే M4M విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. నటీనటులు, సాంకేతిక నిపుణులు, డిస్ట్రిబ్యూటర్లు, మీడియాకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. M4M-2 తొలి భాగాన్ని మించిన ఉత్కంఠ, ఊహించని మలుపులు, అత్యాధునిక సాంకేతికతతో రూపొందే భారీ సైకాలజికల్ థ్రిల్లర్‌గా ఉండబోతుందని వెల్లడించారు. హీరోయిన్ జో శర్మ కూడా సీక్వెల్‌లో మరింత శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నానని చెప్పడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలను త్వరలో ప్రకటించనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!