
సినిమాలు

నేపాల్ ప్రభుత్వం తమ రూ.1 నాణెం డిజైన్‌ను మార్చేందుకు ఆమోదం తెలిపింది. ప్రస్తుతం నాణెంపై ఉన్న రాజకీయ మ్యాప్‌లో భారత్‌తో వివాదంలో ఉన్న కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను తొలగించి, వాటి స్థానంలో ముస్తాంగ్ జిల్లాలోని చారిత్రక లో గ్యాకర్ బౌద్ధ మఠం చిత్రాన్ని ముద్రించాలని నిర్ణయించింది. ఇది నేపాల్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఉండనుంది.
కాలాపాని, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలపై భారత్, నేపాల్ రెండూ తమ హక్కును ప్రకటిస్తున్నాయి. 2020లో నేపాల్ ఈ ప్రాంతాలను తన అధికారిక మ్యాప్‌లో చేర్చడంతో ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. తాజా మార్పు ప్రస్తుతం రూ.1 నాణెంకే పరిమితం కాగా, వివాదాస్పద మ్యాప్ ఉన్న రూ.100 నోటుపై ఎలాంటి మార్పును ప్రభుత్వం ప్రకటించలేదు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!