
బిజినెస్

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి భక్తులు ప్రస్తుతం సుమారు 10 గంటలు వేచి ఉండాల్సి వస్తోంది. సోమవారం సాయంత్రం 4 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 31 కంపార్టుమెంట్లు, నారాయణగిరిలోని ఒక షెడ్లో సర్వదర్శన భక్తులు వేచివున్నారు. అలాగే వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లోని 5 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ దర్శన భక్తులు నిరీక్షిస్తున్నారు.
టీటీడీ వెల్లడించిన వివరాల ప్రకారం శనివారం హుండీ ఆదాయం ₹4.05 కోట్లుగా నమోదైంది. ఆదివారం మొత్తం 90,956 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, 33,046 మంది తలనీలాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!