

ఇంగ్లండ్ ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ జాతీయ జట్టు మేనేజర్ కెవిన్ కీగన్ (75) కన్నుమూశారు. కొంతకాలంగా స్టేజ్-4 క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన సోమవారం తన నివాసంలో తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు. గత ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదం తర్వాత వైద్య పరీక్షల్లో ఆయనకు క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ కాగా, ఈ ఏడాది మేలో న్యూక్యాసిల్లో జరిగిన కార్యక్రమంలో తన అనారోగ్య విషయాన్ని స్వయంగా వెల్లడించారు.
స్కన్‌థోర్ప్ యునైటెడ్‌తో కెరీర్ ప్రారంభించిన కీగన్ వివిధ క్లబ్‌ల తరఫున దాదాపు 600 లీగ్ మ్యాచ్‌లు ఆడారు. లివర్‌పూల్‌కు మూడు ఫస్ట్ డివిజన్ టైటిళ్లు అందించడంలో కీలక పాత్ర పోషించిన ఆయన, హ్యాంబర్గ్ తరఫున ఆడుతూ వరుసగా రెండుసార్లు బెలన్ డి ఓర్ అవార్డును గెలుచుకున్నారు. ఇంగ్లండ్ తరఫున 63 మ్యాచ్‌ల్లో 21 గోల్స్ చేసిన ఆయన కెప్టెన్‌గా, 1999-2000 మధ్య జాతీయ జట్టు మేనేజర్‌గా కూడా సేవలందించారు. ఆయన మృతి పట్ల ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌బాల్ అభిమానులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!