

ఎన్టీఆర్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ‘డ్రాగన్’ గురించి మరో ఆసక్తికర వార్త సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలోని కీలక పాత్ర కోసం బాలీవుడ్ ప్రముఖ నటుడు మనోజ్ బాజ్‌పాయ్ను సంప్రదించినట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రాకపోయినా, ఆయన ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యే అవకాశాలపై అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. తదుపరి షెడ్యూల్‌లో ఆయన సన్నివేశాల చిత్రీకరణ జరిగే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ఇక సినిమా విజువల్ ప్రెజెంటేషన్‌పైనా ఆసక్తికర సమాచారం వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ చిత్రాలకు ప్రత్యేక గుర్తింపుగా నిలిచే డార్క్ టోన్‌కు భిన్నంగా, ఈ చిత్రంలోని ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌ను రంగుల ప్రపంచంలో ఆవిష్కరించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ముఖ్యంగా ఆ భాగంలో బ్లాక్ షేడ్స్‌కు పెద్దగా చోటు ఉండదని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!