

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. అయితే ఈసారి సినిమా లేదా కెరీర్ అప్‌డేట్‌తో కాదు.. ఓ సంప్రదాయ వేడుకతో ఆమె అందరి దృష్టినీ ఆకర్షించారు. తాజాగా జరిగిన సీమంతం వేడుకకు సంబంధించిన ఫొటోలను సమంత సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. భర్త రాజ్ నిడిమోరు, కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఫొటోలతో పాటు సమంత రాసిన భావోద్వేగ నోట్ కూడా నెటిజన్లను ఆకట్టుకుంటోంది.
భారతీయ సంప్రదాయాల పట్ల తనకు ఎప్పుడూ ఎంతో గౌరవం ఉందని సమంత తెలిపారు. ప్రతి ఆచారం వెనుక ఉన్న అర్థం పూర్తిగా తెలియకపోయినా.. మంత్ర ధ్వని, జపం, తరతరాలుగా కొనసాగుతున్న ప్రాచీన ఆచారాల్లో లోతైన శక్తి ఉందని తాను నమ్ముతానని చెప్పారు. వేడుకలో భాగంగా నిర్వహించిన శ్రీ కల్పం గురించి కూడా ఆమె వివరించారు. శ్రీ విద్యా సంప్రదాయానికి సంబంధించిన ఈ ఆచారం ద్వారా తల్లిని, పుట్టబోయే బిడ్డను ఆధ్యాత్మికంగా ఆశీర్వదించే భావన తనను ఎంతో కదిలించిందని తెలిపారు. తనను కేవలం తల్లిగా కాకుండా మరో ప్రాణికి జన్మనిచ్చే పవిత్ర సృష్టికర్తగా గౌరవించడం ప్రత్యేక అనుభూతినిచ్చిందన్నారు. ఈ వేడుకను అనుభవించే అవకాశం కల్పించిన తన సన్నిహితురాలు శిల్పారెడ్డికి సమంత ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!