

మలయాళ చిత్రాలు కంటెంట్‌తో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయి. ఈ క్రమంలో నివిన్ పాలి, మమితా బైజు జంటగా నటించిన ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’ సరికొత్త రికార్డు సృష్టించింది. కేవలం 24 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.300 కోట్ల మార్క్‌ను దాటిన ఈ చిత్రం.. సుమారు రూ.304.9–305 కోట్ల గ్రాస్‌తో ‘లోకా చాప్టర్ వన్: చంద్ర’ను అధిగమించి అత్యధిక వసూళ్లు సాధించిన మలయాళ చిత్రంగా నిలిచింది.
గిరీష్ ఏ.డి. దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి వచ్చిన పాజిటివ్ మౌత్ టాక్ బాక్సాఫీస్ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. అంతేకాదు.. రూ.300 కోట్ల క్లబ్‌లోకి అత్యంత వేగంగా ప్రవేశించిన మలయాళ చిత్రంగానూ ‘బెత్లెహెం కుడుంబ యూనిట్’ రికార్డు సృష్టించింది. ‘లోకా’ ఈ మైలురాయిని చేరుకోవడానికి సుమారు 45 రోజులు పట్టగా.. ఈ చిత్రం కేవలం 24 రోజుల్లోనే ఆ ఘనత సాధించడం విశేషం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!