

భవిష్యత్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టే దిశగా కాంగ్రెస్ హైకమాండ్ సంస్థాగత మార్పులకు కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణతో పాటు మరో రెండు, మూడు రాష్ట్రాలకు కొత్త ఏఐసీసీ ఇన్‌చార్జ్‌లను నియమించే అంశాన్ని పరిశీలిస్తోంది. అలాగే ఐదారు రాష్ట్రాలకు త్వరలో కొత్త పీసీసీ అధ్యక్షులను నియమించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ఏఐసీసీ ఇన్‌చార్జ్ పదవికి ఎ.చెల్లకుమార్ పేరును హైకమాండ్ పరిశీలిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మీనాక్షి నటరాజన్ ఈ నెల 18న ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లనున్నారు. సుమారు 10 నెలల పాటు కాంగ్రెస్ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో కొత్త ఇన్‌చార్జ్‌ను నియమించే అంశంపై పార్టీ అధిష్ఠానం దృష్టి సారించింది. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోనూ సంస్థాగత మార్పులు చేపట్టి భవిష్యత్ రాజకీయ వ్యూహాలను బలోపేతం చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ భావిస్తున్నట్లు సమాచారం.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!