16, సెప్టెంబర్ 2026, బుధవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!

Writer: Chandrika 12:13 AM, 16 సెప్టెంబర్, 2026
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ఎపిసోడ్‌ వినోదం, కామెడీ, భావోద్వేగాలు, వాదనలతో ఆసక్తికరంగా సాగింది. ముఖ్యంగా దేబ్జానీ ఈ ఎపిసోడ్‌లో మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖేశ్‌ గౌడతో ఆమె కెమిస్ట్రీ ఆసక్తికరంగా మారింది. తనకు ముఖేశ్‌ అంటే ఇష్టమని గతంలో చెప్పిన దేబ్జానీ.. అతడు వర్షిణితో కలిసి స్విమ్మింగ్‌ పూల్‌లో ఈత కొట్టడాన్ని చూసి రచ్చ చేసింది. తనను మోసం చేశాడంటూ సరదాగా ఆరోపించింది. దీనికి రామ్‌ ప్రసాద్‌ కూడా మద్దతు ఇవ్వడంతో వాష్‌రూమ్‌ ఏరియాలో నవ్వులు పూశాయి. ఈ సీన్‌ ఎపిసోడ్‌లో ప్రధాన హైలైట్‌గా నిలిచింది.

ఇక ‘డార్లింగ్‌’ అనే పదంపై జరిగిన చర్చలోనూ దేబ్జానీ తనదైన శైలిలో కామెడీ పండించింది. చాలామంది ‘డార్లింగ్‌’ అనే పదాన్ని తప్పుగా ఉపయోగిస్తున్నారని, కనీసం దాని స్పెల్లింగ్‌ కూడా తెలియదని నరేష్‌ ముందు చెప్పింది. నరేష్‌ స్పెల్లింగ్‌ చెప్పేందుకు ప్రయత్నించగా.. దేబ్జానీ సరదాగా అతడిని ఆపేయడంతో హౌస్‌లో నవ్వులు పూశాయి. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌లో దేబ్జానీని తెలుగు సరిగా మాట్లాడలేదనే కారణంతో అనర్హురాలిగా భావించాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అయితే ఆమెకు పలువురు కంటెస్టెంట్లు మద్దతుగా నిలిచారు. తనకు ఇంతమంది సపోర్ట్‌ చేయడాన్ని దేబ్జానీ సంతోషంగా స్వీకరించి.. ఇదే తన అసలైన సక్సెస్‌ అంటూ స్పందించింది. షాలినితో ఆమె చేసిన వాగ్వాదం కూడా ఆసక్తిని పెంచింది.

కెప్టెన్సీ కంటెండర్ల ఎంపిక కోసం నిర్వహించిన టాస్క్‌ కూడా ఉత్కంఠగా సాగింది. రెండో వారంలో ‘పవర్‌ ఆఫ్‌ పీపుల్‌’ థీమ్‌ను తీసుకొచ్చిన బిగ్‌బాస్‌.. కెప్టెన్సీ కంటెండర్లను ప్రేక్షకులే ఎంచుకునే అవకాశం ఇచ్చారు. ప్రేక్షకుల ఓట్లతో త్రిగుణ్‌, దేబ్జానీ, అమన్‌, షాలిని, ముఖేశ్‌, రోహిత్‌, ఝాన్సీ, ఆటో రాంప్రసాద్‌ కెప్టెన్సీ రేసులోకి వచ్చారు. గజిబిజిగా ఉన్న అక్షరాల్లో దాగి ఉన్న పదాన్ని గుర్తించి, ఆ తర్వాత తమలో కెప్టెన్‌ అయ్యేందుకు ఎవరు అనర్హులో కంటెస్టెంట్లు నిర్ణయించాల్సి వచ్చింది. దీంతో ఒక్కొక్కరు మరొకరిపై ఆరోపణలు చేస్తూ గట్టి వాదనలకు దిగారు. తొలి రౌండ్‌లోనే త్రిగుణ్‌ ఎలిమినేట్‌ అయ్యాడు. పలువురు కంటెస్టెంట్లు అతడిని కెప్టెన్‌ అయ్యేందుకు అనర్హుడిగా భావించారు. అనంతరం రామ్‌ ప్రసాద్‌, దేబ్జానీ, రోహిత్‌ కూడా పోటీ నుంచి తప్పుకున్నారు. చివరికి ఝాన్సీ, షాలిని, అమన్‌, ముఖేశ్‌ గౌడ మధ్య పోటీ కొనసాగింది. వీరిలో అమన్‌, ముఖేశ్‌ పరిస్థితి కాస్త క్లిష్టంగా మారింది.

ఇదిలా ఉంటే.. త్రిగుణ్‌, సుధీర్‌ మధ్య విభేదాలు కూడా మరోసారి బయటపడ్డాయి. టిష్యూలు పడేయడం విషయంలో సుధీర్‌ వ్యవహరించిన తీరుపై త్రిగుణ్‌ అభ్యంతరం వ్యక్తం చేశాడు. షాలినికి సపోర్ట్‌ చేసే విషయంలోనూ సుధీర్‌ వ్యవహరించిన తీరును తప్పుపట్టాడు. ఒక దశలో సుధీర్‌ ముఖం కూడా చూడాలని లేదంటూ త్రిగుణ్‌ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అయితే ఆ తర్వాత ఇద్దరూ కూర్చొని మాట్లాడుకున్నారు. సృష్టి విషయంలో పూర్తి విషయం తెలుసుకోకుండా మాట్లాడావని, తన క్యారెక్టర్‌ను తప్పుగా చూపించావని త్రిగుణ్‌.. సుధీర్‌కు క్లాస్‌ ఇచ్చాడు. దీంతో వీరిద్దరి మధ్య ఉన్న విభేదాలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

మొత్తంగా డే 9 ఎపిసోడ్‌కు దేబ్జానీ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ముఖేశ్‌తో ఆమె కెమిస్ట్రీ, ‘నన్ను మోసం చేశావు’ అంటూ చేసిన సరదా కామెంట్లు, డార్లింగ్‌ స్పెల్లింగ్‌పై చేసిన కామెడీ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరోవైపు కెప్టెన్సీ టాస్క్‌ గేమ్‌ను మరింత సీరియస్‌గా మార్చింది. షాలిని, ఝాన్సీ కూడా తమ ఆటతీరుతో హైలైట్‌ అయ్యారు. కంటెస్టెంట్ల మధ్య ఈక్వేషన్స్‌ మారుతున్న నేపథ్యంలో.. రాబోయే రోజుల్లో మరిన్ని గొడవలు, వ్యూహాలు, ఊహించని ట్విస్టులు చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా

బిగ్‌బాస్ తెలుగు 10 డే 9 ప్రోమో 2: రోహిత్, త్రిగుణ్, షాలిని రచ్చతో హౌస్‌లో హై వోల్టేజ్ డ్రామా

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

బిగ్‌బాస్‌ తెలుగు 10:క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌తో ఆకట్టుకుంటున్న బెంగాలీ భామ...ఎవరీ దేబ్జానీ మోదక్‌?

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

బిగ్‌బాస్‌ తమిళ్‌ 10లో రాజకీయ రగడ..

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 ప్రోమో 1: కెప్టెన్సీ రేసులో త్రిగుణ్‌కు షాక్‌..

ట్యాగ్లు
బిగ్‌బాస్‌ తెలుగు 10బిగ్‌బాస్‌ డే 9బిగ్‌బాస్‌ తెలుగు రివ్యూసెప్టెంబర్‌ 15 ఎపిసోడ్‌దేబ్జానీముఖేశ్‌ గౌడషాలినిఝాన్సీత్రిగుణ్‌సుధీర్‌కెప్టెన్సీ టాస్క్‌బిగ్‌బాస్‌ తెలుగు అప్‌డేట్స్‌

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!
బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

బిగ్ బాస్ తెలుగు 10: ఈ వారం అందరి టార్గెట్ త్రిగుణేనా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

బిగ్ బాస్ తెలుగు 10: రోహిత్ తర్వాత వంశీ టర్న్...త్రిగుణ్ చర్చలకు అంతులేకుండా పోయిందా?

AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!
షోస్

బిగ్‌బాస్‌ తెలుగు 10 డే 9 : హౌస్‌లో కొత్త లవ్‌ ట్రాక్‌!

దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు..
రాజకీయాలు

దానం నాగేందర్‌ అనర్హత పిటిషన్లపై రేపు హైకోర్టు తీర్పు..

రాహుల్‌గాంధీ సన్నిహితుడికి తెలంగాణ బాధ్యతలు..?
రాజకీయాలు

రాహుల్‌గాంధీ సన్నిహితుడికి తెలంగాణ బాధ్యతలు..?

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..
జనరల్

మోదీ పుట్టినరోజుకు కాశీ కళాకారుడి ప్రత్యేక కానుక..

శ్రీవారికి  పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..
జనరల్

శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు..

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..
సినిమాలు

‘కింగ్‌’ రిలీజ్‌పై క్లారిటీ ఇచ్చిన షారుక్‌ ఖాన్‌..

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..
జనరల్

సీఆర్పీఎఫ్‌ కోబ్రా యూనిట్‌కు తొలి మహిళా ఐజీగా సంయుక్తా పరాశర్‌..

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..
క్రీడలు

అఫ్ఘానిస్థాన్‌పై టీమిండియా ఘన విజయం..

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..
బిజినెస్

యూపీఐ చెల్లింపులపై కొత్త ఛార్జీలు..

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..
క్రీడలు

ఫిడే చెస్‌ ఒలింపియాడ్‌లో భారత్‌కు చేదు అనుభవం..

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..
సినిమాలు

మాలీవుడ్‌ బాక్సాఫీస్‌ను షేక్‌ చేస్తున్న ‘బెత్లెహెం కుటుంబ యూనిట్’..

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..
జనరల్

అంతరిక్షంలో వ్యోమగాముల ఫుట్‌బాల్‌ మ్యాచ్‌..