

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు నితీష్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక పౌరాణిక చిత్రం ‘రామాయణ’ నుంచి వినాయక చవితి సందర్భంగా అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. రణ్‌బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతాదేవిగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి సీతారాముల ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు. సీతారాములు ఏకాంతంగా ఉన్న దివ్యమైన, అందమైన సందర్భాన్ని ఈ పోస్టర్‌లో చూపించారు. ప్రస్తుతం ఈ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. ఈ చిత్రంలో యష్ రావణాసురుడిగా, కాజల్ అగర్వాల్ మండోదరిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా కనిపించనున్నారు.
‘రామాయణ’ చిత్రానికి మరో ప్రధాన ఆకర్షణ సంగీతం. హాలీవుడ్ ప్రముఖ సంగీత దర్శకుడు హాన్స్ జిమ్మర్ ఈ ప్రాజెక్ట్‌కు సంగీతం అందిస్తున్నారు. అత్యున్నత సాంకేతిక విలువలతో రూపొందుతున్న ఈ పౌరాణిక చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించారు. తొలి భాగాన్ని ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేయనున్నారు. రెండో భాగాన్ని వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!