

లేడీ సూపర్‌స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న ప్రతిష్టాత్మక ఫాంటసీ ఎంటర్‌టైనర్ ‘మూకుత్తి అమ్మన్ 2’పై అంచనాలు పెరుగుతున్నాయి. సీనియర్ దర్శకుడు సుందర్ సి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో నయనతార మరోసారి శక్తిమంతమైన దైవిక పాత్రలో కనిపించనున్నారు. ‘మూకుత్తి అమ్మన్’కు సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని అవ్ని సినిమాస్, వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్స్, రౌడీ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మాత ఇషారి గణేష్ భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా చిత్రబృందం ‘ది రైస్ ఆఫ్ మహాశక్తి’ పేరుతో టీజర్‌ను విడుదల చేసి, దీపావళి కానుకగా సినిమాను విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
టీజర్‌లో పాతకాలం నాటి ఓ రాజ్యం భయంకరమైన దండయాత్రను ఎదుర్కొనే పరిస్థితులతో పాటు ప్రస్తుత కాలంలో ప్రజలను చుట్టుముడుతున్న ప్రమాదాన్ని చూపించారు. భయం, ఆందోళనతో ప్రజలు దేవుడిని ఆశ్రయించే సమయంలో నయనతార అద్భుతమైన దైవిక రూపంలో కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో టీజర్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో దునియా విజయ్, రెజీనా కసాండ్రా, ఊర్వశి, యోగిబాబు, మైనా నందిని, గరుడ రామ్, అభినయ, సునీల్ వర్మ, నితిన్ సత్య కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంగీతాన్ని హిప్‌హాప్ తమిళ అందిస్తున్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!