

నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘ది ప్యారడైజ్’పై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి గత చిత్రం ‘దసరా’కు మంచి స్పందన రావడంతో ఈ ప్రాజెక్ట్‌పై మొదటి నుంచే ఆసక్తి పెరిగింది. తాజాగా విడుదలైన పాటలు, టీజర్‌తో హైప్ మరింత పెరగగా.. ఇప్పుడు ఆ క్రేజ్ ఓవర్సీస్ మార్కెట్‌లోనూ కనిపిస్తోంది. సెప్టెంబర్ 23న నార్త్ అమెరికాలో ప్రత్యంగిరా సినిమాస్ ఆధ్వర్యంలో ప్రీమియర్ షోలు ప్రదర్శించనుండగా, ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌కు మంచి స్పందన లభిస్తోంది.
తాజా సమాచారం ప్రకారం నార్త్ అమెరికా అడ్వాన్స్ బుకింగ్స్‌లో ‘ది ప్యారడైజ్’ ఇప్పటికే 250K డాలర్ల మార్క్‌ను దాటింది. ఈ విషయాన్ని మేకర్స్ వెల్లడించారు. దీంతో సినిమా విడుదలకు ముందే ఓవర్సీస్‌లో మంచి దూకుడు చూపిస్తోంది. ప్రీమియర్ షోలకు ఇంకా సమయం ఉండటంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌పై ఉన్న అంచనాలు, ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతున్నాయి. మొత్తంగా థియేటర్లలోకి రాకముందే ‘ది ప్యారడైజ్’ ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద తన ప్రభావాన్ని చూపిస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!