

నాగర్‌కోయిల్‌కు చెందిన శబరివర్మన్ అనే దివ్యాంగుడు గుట్కా, పాన్ మసాలా అక్రమ విక్రయాల ఆరోపణలపై పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే కేసులో గతంలోనూ అతడిపై రెండు కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. జూలై 9న కోర్టు అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపగా, సోమవారం తెల్లవారుజామున జైలులో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతదేహంపై గాయాలు ఉన్నాయని ఆరోపించగా, పోస్టుమార్టంలో 19 గాయాలు గుర్తించినట్లు అధికారులు వెల్లడించారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన అధికారులు జైలు సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి, ముగ్గురు జైలు వార్డర్లు, కొంతమంది ఖైదీలు శబరివర్మన్‌పై దాడి చేసినట్లు గుర్తించినట్లు తెలిపారు. సంబంధిత జైలు సిబ్బందిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. శబరివర్మన్ మృతి తమిళనాడులో రాజకీయ వివాదానికి దారితీసింది. డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ ఈ ఘటనపై స్పందిస్తూ, కస్టడీలో జరిగిన మరణంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!