
జనరల్

ప్రపంచవ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న క్రిస్టఫర్ నోలన్ చిత్రం ‘ది ఒడిస్సీ’ విడుదలకు ముందే మరో ప్రత్యేక ఆకర్షణగా మేకింగ్ డాక్యుమెంటరీని విడుదల చేయనున్నారు. భారీ నిర్మాణం, అద్భుతమైన విజువల్స్, సాంకేతిక నైపుణ్యం, నటీనటులు మరియు సాంకేతిక బృందం కృషిని ఇందులో ప్రత్యేకంగా చూపించనున్నారు.
జూలై 14 నుంచి ఈ మేకింగ్ డాక్యుమెంటరీ జియో హాట్‌స్టార్, పీకాక్ ఓటీటీ వేదికల్లో స్ట్రీమింగ్ కానుంది. మాట్ డామన్, టామ్ హాలెండ్, అన్నె హాత్‌వే, జెండయా, రాబర్ట్ ప్యాటిన్సన్, చార్లీజ్ థెరాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘ది ఒడిస్సీ’ జూలై 17న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!