
జనరల్

తమిళనాడు ముఖ్యమంత్రి, నటుడు విజయ్ ప్రధాన పాత్రలో నటించిన చివరి చిత్రం ‘జన నాయకన్’ విడుదల తేదీ ఖరారైనట్లు సమాచారం. ప్రముఖ టికెట్ బుకింగ్ యాప్ ప్రకారం ఈ చిత్రం జులై 23న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ ప్రకటనతో విజయ్ అభిమానులు సోషల్ మీడియాలో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
వాస్తవానికి ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉండగా, సెన్సార్ సమస్యలు, కోర్టు కేసులు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) పునఃపరిశీలన కారణంగా పలుమార్లు వాయిదా పడింది. తాజాగా ‘ఏ’ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం 183 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రానుంది. హెచ్. వినోద్ దర్శకత్వంలో రూపొందిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మించగా, పూజా హెగ్డే కథానాయికగా, మమితా బైజు కీలక పాత్రలో నటించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!