

ప్రస్తుతం శర్వానంద్ తన ‘భోగి’ చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉండగానే, దర్శకుడు శ్రీను వైట్లతో తెరకెక్కిస్తున్న కొత్త సినిమాను కూడా వేగంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఇప్పటికే తొలి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం, ఆగస్టు రెండో వారంలో రెండో షెడ్యూల్ ప్రారంభించుకోనుంది. ఇదిలా ఉండగా, ఈ సినిమాలో శక్తివంతమైన పోలీసు అధికారిణి పాత్ర కోసం బాలీవుడ్ నటి రవీనా టాండన్‌ను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
అదే విధంగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. వినోదం, యాక్షన్ అంశాల మేళవింపుతో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్‌టైనర్ను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చిత్రబృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘జార్జ్ క్రిష్’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!