
జనరల్

హీరో నాని నటుడిగానే కాకుండా మంచి అభిరుచి గల నిర్మాతగా కూడా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గత ఏడాది ఆయన నిర్మాణంలో వచ్చిన 'కోర్ట్' చిత్రం విమర్శకులు, ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంది. అయితే ఆ సినిమా తర్వాత ఆయన నిర్మాణ సంస్థ నుంచి మరో కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించలేదు.
తాజా సమాచారం ప్రకారం, 'దండోరా' ఫేమ్ మురళీ కాంత్ దర్శకత్వంలో నాని ఓ కొత్త చిత్రాన్ని నిర్మించే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో హీరోగా నితిన్‌ను సంప్రదించినట్లు, ఇప్పటికే కథా చర్చలు కూడా జరిగినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం నితిన్ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!