

నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో నటిస్తూనే వరుసగా కొత్త ప్రాజెక్ట్‌లకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇప్పటికే కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమాకు అంగీకరించగా, పూజా కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అలాగే వివేక్ ఆత్రేయ దర్శకత్వంలోనూ మరో సినిమా చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.
ఇదిలా ఉండగా, దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల బాలకృష్ణకు కొత్త కథ వినిపించగా, అది ఆయనకు నచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో 'భగవంత్ కేసరి' తర్వాత ఈ క్రేజీ కాంబినేషన్ మరోసారి రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం వెంకటేష్, కళ్యాణ్ రామ్‌లతో సినిమా తెరకెక్కిస్తున్న అనిల్ రావిపూడి, ఆ చిత్రం పూర్తయ్యాక బాలయ్య ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!