
తెలుగు ప్రేక్షకులకు ‘దేశముదురు’ సినిమాతో పరిచయమైన హీరోయిన్ హన్సిక మోత్వానీ తన వైవాహిక జీవితానికి ముగింపు పలికింది. వ్యాపారవేత్త సోహెల్ ఖతూరియాతో నాలుగేళ్ల క్రితం జరిగిన వివాహ బంధం నుంచి ఆమె విడిపోయింది. పరస్పర అంగీకారంతో ఇద్దరూ విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో ముంబైలోని బాంద్రా ఫ్యామిలీ కోర్టు వారికి విడాకులు మంజూరు చేసింది. భర్త నుంచి ఎలాంటి భరణం కోరకుండానే హన్సిక కోర్టును ఆశ్రయించడం గమనార్హం.
పెళ్లైన కొద్ది కాలానికే ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు తలెత్తాయని, చిన్న చిన్న విషయాలకే గొడవలు జరుగుతుండటంతో కలిసి జీవించడం కష్టమై విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలిపారు. హన్సిక, సోహెల్ ఖతూరియా 2022 డిసెంబర్ 4న వివాహం చేసుకోగా, 2024 జులై నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన హన్సిక దక్షిణాది సినీ పరిశ్రమలో అనేక సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించింది.










కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!