

‘చెన్నై లవ్ స్టోరీ’ సినిమా విజయాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో చిత్రబృందం గ్రాండ్ సక్సెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి యువసామ్రాట్ నాగచైతన్య ముఖ్య అతిథిగా హాజరై చిత్ర విజయాన్ని సెలబ్రేట్ చేశారు. కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ జంటగా నటించిన ఈ సినిమా అందమైన ప్రేమ కథతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ మంచి వసూళ్లు సాధిస్తోంది. విడుదలైన మూడు రోజుల్లోనే రూ.40.1 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్రబృందం ప్రకటించింది.
ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ ‘చెన్నై లవ్ స్టోరీ’ ఒక పరిణితి చెందిన ప్రేమ కథ అని, ఇలాంటి భావోద్వేగాలతో కూడిన కథలు ప్రేక్షకులకు మరింత దగ్గరవుతున్నాయని తెలిపారు. దర్శకుడు రవి నంబూరి, రచయిత సాయి రాజేష్, నిర్మాత ఎస్‌కేఎన్, హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ పనితీరును ప్రశంసించారు. ప్రేక్షకులు, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు చిత్రబృందం కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ విజయం కొత్త టాలెంట్‌కు ప్రేరణగా నిలుస్తుందని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!