

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేసిన ఒక వీడియోను మెటా తాత్కాలికంగా బ్లాక్ చేయడంతో కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ (MeitY) తీవ్రంగా స్పందించింది. ఈ చర్యకు గల కారణాలపై వివరణ ఇవ్వాలని మెటా ప్రతినిధులను సమన్లు జారీ చేసి వివరణ కోరినట్లు అధికార వర్గాలు తెలిపాయి. విద్యార్థుల నిరసనల నేపథ్యంలో ప్రధాని మోదీ యువతను ఉద్దేశించి పరీక్షల పేపర్ లీకేజీలపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇస్తూ ఈ వీడియోను పంచుకున్నారు.
వివాదం తలెత్తిన అనంతరం మెటా స్పందిస్తూ, వీడియో బ్లాక్ కావడం సాంకేతిక లోపం కారణంగా జరిగిందని తెలిపింది. ఈ ఘటనపై క్షమాపణలు తెలియజేస్తూ వీడియోను తిరిగి ఫేస్‌బుక్‌లో అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ప్రకటించింది. పరీక్షల పేపర్ లీకేజీలపై ప్రధాని మోదీ చేసిన సందేశానికి ఇప్పటికే సామాజిక మాధ్యమాల్లో విశేష స్పందన లభించిన నేపథ్యంలో ఈ తాత్కాలిక బ్లాక్ దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!