

ఊబకాయం, అధిక బరువు సమస్యలు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్యకరమైన జీవనశైలిని కోరుకునే వారికి డైటీషియన్లు ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ ఇడ్లీని సూచిస్తున్నారు. సాధారణ ఇడ్లీ పిండిలో పన్నీర్, మొలకెత్తిన మెంతులు, ఐచ్ఛికంగా క్యారెట్ కలిపి తయారు చేసే ఈ ఇడ్లీ రుచికరంగా ఉండటమే కాకుండా బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుంది. పన్నీర్‌లో ఉన్న ప్రోటీన్ కండరాల అభివృద్ధికి, కడుపు నిండుగా ఉండటానికి ఉపయోగపడుతుంది. మెంతులు కొవ్వు తగ్గించడంలో సహాయపడగా, క్యారెట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
ఈ ఇడ్లీకి తోడు ప్రత్యేక ప్రోటీన్ చట్నీని కూడా నిపుణులు సూచిస్తున్నారు. అల్లం, మిరియాలు, జీలకర్ర, మెంతులు, సన్‌ఫ్లవర్ గింజలు, గుమ్మడికాయ గింజలు, శనగపప్పు, కొబ్బరి వంటి పదార్థాలతో తయారయ్యే ఈ చట్నీ జీవక్రియను పెంచి, గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడుతుంది. ఈ ప్రోటీన్ ఇడ్లీ, చట్నీ కలయిక బరువు నియంత్రణ, శక్తి పెంపు, ఆరోగ్యకర జీవనశైలికి దోహదం చేస్తుంది. అయితే ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వైద్యుల సలహా తీసుకోవడం అవసరం.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!