

సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్‌పై రూపొందుతున్న 99వ ప్రాజెక్ట్ ‘మకుటం’ నుంచి మరో సాంగ్ విడుదలైంది. విశాల్ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న ఈ చిత్రంలో అంజలి, దుషార విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ‘ది రైజ్ ఆఫ్ లింగా’, ‘నచ్చాకే వచ్చేరా’ పాటలు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు పెంచగా, తాజాగా ‘కలతేలా’ అనే సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ పాట కుటుంబ భావోద్వేగాలు, ప్రేరణాత్మక అంశాలతో రూపొందినట్లు కనిపిస్తోంది.

ఈ పాటలో విశాల్, దుషార విజయన్‌తో పాటు పిల్లలు కూడా కనిపిస్తుండటం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. రాజశ్రీ సుధాకర్ రాసిన ఈ పాటను కృష్ణ తేజస్వి ఆలపించగా, జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన సంగీతం క్యాచీగా ఉంది. రిచర్డ్ ఎం. నాథన్, అభినందన్ రామానుజం సినిమాటోగ్రఫీ నిర్వహించగా, ఎన్.బి. శ్రీకాంత్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. త్వరలోనే ఈ మూవీ విడుదల తేదీని ప్రకటించనున్నారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!