

జూలై 31 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానున్న ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘ఆబ్జెక్షన్ మై లార్డ్’ ప్రివ్యూ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. శ్రీకాంత్, అనన్య శర్మ, ముఖేష్ రిషి, స్నేహాల్, సమీర్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ భావోద్వేగ కోర్ట్‌రూమ్ డ్రామాకు సంతోష్ అయ్యప్పన్ దర్శకత్వం వహించగా, డ్రీమ్ హౌస్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మించారు. కేవలం 19 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసిన ఈ సిరీస్ కోసం నటీనటులు, సాంకేతిక బృందం ఎంతో కష్టపడ్డారని అందరూ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా హీరో శ్రీకాంత్ మాట్లాడుతూ, మెగాస్టార్ చిరంజీవి ఈ సిరీస్‌ను చూసి ప్రశంసించడం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. దర్శకుడు, నిర్మాత, నటీనటులు అందరూ కలిసి నాణ్యతకు ప్రాధాన్యం ఇచ్చి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశారని చెప్పారు. భావోద్వేగాలు, ఉత్కంఠభరితమైన కథనం, బలమైన పాత్రలతో రూపొందిన ఈ సిరీస్ ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం విశ్వాసం వ్యక్తం చేసింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!