

పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో జరుగుతున్న నిరసనలపై చేసిన వ్యాఖ్యలు మరోసారి వివాదానికి దారితీశాయి. స్థానిక టెలివిజన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన, నిరసనకారులు పాకిస్థాన్ శత్రువులతో సమానమని, వారితో చర్చలకు అవకాశం లేదని వ్యాఖ్యానించారు. అలాగే భద్రతా బలగాల చర్యలను సమర్థించారు. ఇదే సమయంలో పీఓకే అసెంబ్లీ ఎన్నికల తొలి దశ పోలింగ్ సందర్భంగా చోటుచేసుకున్న హింసలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ) సభ్యులు మృతి చెందినట్లు, పలువురు గాయపడినట్లు సంస్థ పేర్కొంది.
పీఓకేలోని 45 అసెంబ్లీ స్థానాలకు మూడు దశల్లో ఎన్నికలు నిర్వహిస్తున్న పాకిస్థాన్, తొలి దశ పోలింగ్‌ను ఇప్పటికే పూర్తి చేసింది. ఈ పరిణామాల నేపథ్యంలో భారత్ తన వైఖరిని మరోసారి స్పష్టం చేసింది. పాక్ ఆక్రమణలో ఉన్న ప్రాంతాలు ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని పేర్కొంటూ, ఆ ప్రాంతంలో జరుగుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మానవ హక్కుల ఉల్లంఘనల నుంచి దృష్టి మళ్లించేందుకు ఎన్నికలను ఉపయోగించుకుంటోందని పాకిస్థాన్‌పై విమర్శలు చేసింది.






















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!