

హైదరాబాద్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిర్వహించిన ప్రత్యేక ఫ్యాన్స్ మీట్‌కు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర నుంచి దాదాపు 900 మంది అభిమానులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా బ్లాక్ డ్రెస్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. అభిమానులపై తన అభిమానాన్ని చాటుతూ AAFA (అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్) తరఫున 900 మంది అభిమానులకు ఇన్సూరెన్స్ పాలసీలు అందించినట్లు సమాచారం.
దాదాపు ఆరు గంటల పాటు అభిమానులతో గడిపిన అల్లు అర్జున్ ప్రతి ఒక్కరితో వ్యక్తిగతంగా ఫొటోలు దిగారు. అభిమాన సంఘాల ప్రేమకు కృతజ్ఞతలు తెలుపుతూ, ద్వేషం లేదా ట్రోలింగ్‌పై సమయం వృథా చేయకుండా జీవితాన్ని సానుకూలంగా గడపాలని సూచించారు. తనకు ఉన్న సమయం, శక్తిని మంచి పనులకు వినియోగించాలని అభిమానులకు సందేశం ఇచ్చారు. భవిష్యత్తులో ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇలాంటి ఫ్యాన్స్ మీట్లు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు కూడా వెల్లడించారు.
















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!